ఇకపై స్వదేశీ వస్తువులు
పెంచుకోవాలి స్వదేశీ వస్తువులపై అభిమానం
అప్పుడు అభివృద్ధి పథంలో దేశం చేస్తుంది పయనం
గుర్తిద్దాం మన వారి శ్రమ
పెంచుకుందాం ఇక్కడ తయారు అయ్యే వస్తువులపై ప్రేమ
మోదీ గారి పలుకులను స్వాగతిద్దాం
మన దేశం పై ప్రేమ చూపిద్దాం
ప్రస్తుత పరిస్థితులలో మన కంపెనీలే వచ్చాయి మనకు అండగా
వారి వస్తువులు కొనడమే ఉండాలి ఇక మన అజెండా
మన వస్తువులు కొంటే మళ్ళీ తోర్పడుతాయి మన దేశ అభివృద్ధికి
మన శ్రేయస్సు చేసే ఆ పనికి ఆలోచన దేనికి???
పెంచుకుందాం స్వదేశీతనం
తగ్గిద్దాం విదేశీ కంపెనీల పెత్తనం
మన స్లోగన్ మేడ్ ఇన్ ఇండియా
మన సత్తా చూడాలి ఈ దునియా
జి.సునిల్