కరోనా నేర్పిన పాఠం
బ్రతకటానికి ప్రతి ఒక్క జీవుడు
సృష్టించాడు ప్రకృతిని ఆ బ్రహ్మ దేవుడు
అందుకు మనం ప్రవర్తించాం విరుద్దంగా
అందుకే మన జీవితాలు అయ్యాయి ఇలా చిన్నా భిన్నంగా
మన గుప్పిట్లో ఉందనుకున్నాం సర్వం
మానవ జాతి కన్నా గొప్పది ఏదీ లేదు అని పడ్దాం గర్వం
కరోనా రూపంలో ప్రతి ఒక్కరికి ప్రకృతి ఇచ్చింది గుణపాఠం
నిర్లక్ష్యం చేస్తే ఇలాగే ఉంటుంది అని ఇచ్చింది అల్టిమేటం
ఇప్పుడు అందరు పడుతున్నారు తిప్పలు
కాని గ్రహిస్తున్నారా చేసిన తప్పులు???
నేర్చుకుంటే ఉంటుంది జీవించగల భవిష్యత్తు
నేర్చుకోకపోతే ఇక ఎప్పటికీ మన జీవితాలు అవుతాయి ఇలాగే చిత్తు
ఎంతో విలువైనది ప్రకృతి
విలువ ఇచ్చి కాపాడుకుందాం దేవుడు సృష్టించిన ప్రతి జాతి
ఇకనైనా ఆపుదాం అన్ని పాడుచేసుకుంటూ సాధించే అభివృద్ధి వేగం
ప్రకృతి కాపాడుకోవటం కూడా అవ్వాలి మనం సాధించే అభివృద్ధిలో భాగం
నీవు నిర్లక్ష్యం చేసిన విభాగాలు నేడు వచ్చాయి నీకు అండగా
ప్రతి ఒక్కరిని కాపాడుకుని చేసుకుందాం మన జీవితాన్ని అందంగా
పాటిద్దాం సృష్టి ధర్మం
క్రమశిక్షణతో కూడిన జీవనం అవ్వాలి మన ధ్యేయం
సమాజ హితం కోరే విధంగా ఇక నుంచి ఉండాలి నీ పాత్ర
లేకపోతే మానవ జాతి ఉండేది అని చెప్పుకుంటుంది రానున్న చరిత్ర
జి.సునిల్
1 comment:
Very nice. Keep it up.
Post a Comment