Friday, August 19, 2016

సింధు....భారత క్రీడా కేంద్ర బింధు

సింధు....భారత క్రీడా కేంద్ర బింధు
 
కఠోర శ్రమ చేసి పతకం అన్వేషణలో వేళ్ళావు బ్రజిల్
చివరికీ నీ కష్టంతొ చేరావు నీ మంజిల్
    
శుభాకాంక్షలు సింధు
నీ విజయం ప్రతీ భారతీయునికి అయ్యింది ఎంతో పసందు 
  
నువ్వు సాదించిన రజితం
అవుతుంది చరిత్రలొ సువర్ణ అక్షరాలతో లికితం

పెంచావు దేశ కీర్తి
కలిగించావు ప్రతి ఒకరికి స్పూర్తి

అభినంధనీయం నీ పోరాట పటిమ
సాధించావు ప్రతి భారతీయునీ ప్రేమ 

తెలంగాణ బిడ్డ ఈ గణత సాదించినందుకు వుంది ఇంక ఎంతో గర్వం
ప్రతి ఒకరం అవుతున్నాం ఆనంద పర్వం

నీ గెలుపుతో గర్వంతొ ఎగురుతుంది భారత పతాకం
నీ గెలుపు మార్చాలి మన క్రిడల జాతకం

ఫలించింది లాల్ దర్వాజ అమ్మ వారి ఆశ్శిసులు
ఇంత గర్వ పడే విజయం అందించిన నీకు మా దన్యవాధములు

నీ విజయం చూసి ప్రభుత్వం పట్టాలి క్రిడాకారులకి బ్రహ్మరధం
సాగేలా చేయాలి వారిని విజయ పధం

నీకూ రానున్న రోజుల్లొ అవ్వాలి మర్రిన్ని విజయాలు సొంతం 
నీకు పలుకుతున్నాం మేము అందరం మా హర్దిక స్వాగతం       
 
జి.సునిల్

Friday, August 12, 2016

కూతుర్లకి ప్రేమతొ


కూతుర్లకి ప్రేమతొ 

కూతురు అని చులకన చూసే వారికి మీరు పలకాలి పాఠం
మీరు ఎక్కాలి వారికి అందనంత ఎతైన పీఠం 

మీరు కాకుడదు భారం
మీరు అవ్వాలి మాకు సంతొషాని అందించే తీరం

మీ గమ్యానికి ఇప్పుడు పడుతున్నాయి ఓనమాలు
ఆశీస్తున్న ప్రతి విషయంలొ మీరు పొందుతారు విజయాలు 
   
మీ పయనంలొ నేను అవ్వాలని కోరుకుంటున్న మంచి గురువు
ప్రయత్నం చేస్త మీరు అయ్యేలా మీ గమ్యానికి చేరువు  

మీ సంకల్పంతొ చేరండి విజయపదం 
మీరు అవ్వాలి మాకు భవిషత్తులొ మాకు ఆయుదం   

కంటే కూతుర్నే కనాలి అని ఎందుకు అంటారొ అందరికి తెలుసు
వారికే ఉంటుంది కాబట్టి తల్లితంద్రుల అన్ని సమయాలో తోడు ఉండే మనసు


మీ నాన్న
జి.సునిల్

Tuesday, August 9, 2016

చలొ వరంగల్

చలొ వరంగల్

ఇప్పుడు వారంతరంలొ అంటున్నా చలొ వరంగల్
చేయడానికి అక్కడ నా బంగారాలతొ హల్ చల్

అక్కడ ఉన్నారు నా ముద్దుల కూతుర్లు
చేప్పుకుంటా వాళ్ళ తొ తీపీ కబుర్లు

అలా ఈ వారంతరం
తీరుస్తుంది వారం మొత్తం పొందిన బారం

అలానే ఆ  రోజు కంప్లెంట్ చిట్ట విప్పుతుంది మంజుల
అంటుంది బాగా అల్లరి చేసే ప్రవర్తికతొ ఎలా

అలానే అంటుంది చిన్న కూతురు చేస్తుంది నిద్ర లేని రాత్రులు
అలా చేప్పుకుంటుంది తన కష్టాలు

అన్ని విన్న తర్వాత చేస్తా వారి మధ్య సయొధ్యకి ప్రయత్నం
నేను ఉన్న రోజు ప్రవర్తిక నా మాట వినె ఒక రత్నం

వాళ్ళ అమ్మ అంటుంది అన్ని రోజులు ఇలానే ఉంటే బాగుండు
అంటుంది నేను వెళ్ళిన తర్వాత తీస్తుంది తన బెండు

అలా చూస్తునే గడిచిపోతుంది ఆదివారపు సమయం
మళ్ళీ దూరం అయే వ్యధతొ మళ్ళీ హైదరబాద్ కదుల్తుంది ఈ హృదయం



ఆ త్రయం త్వరగా వస్తే హైదరబాద్ 
ఈ ఒంతరితనం నుంచి అవ్వచ్చు ఆజాద్


జి.సునిల్