Tuesday, May 17, 2016

మిస్ యు హని


మిస్ యు హని (6TH POEM ON MY DAUGHTER)


ఇంట్లో వచ్చేది చేంగు చేంగు మని ఒక చిన లేడి
అంటూ డాడి

ఇప్పుడు వినిపిచ్చేలా చేస్తుంది ఫోన్
హాయిగా ఉంటది వినగానే ఆ టోన్  

ప్రతి క్షణం చేస్తుంది నా మదిలొ ఆమే హల్చల్
ఫొన్ చేస్తే అంటుంది డాడి నువ్వు వస్తావ వరంగల్

ఆనంద పరుస్తాయి ఆ తీపీ పలుకులు
అవే ఇక్కడ గడవటానికి తీపి గుర్తులు

రోజు అమే అల్లరి, వాళ్ళ అమ్మ చేప్పే కంప్లేంట్
కాని నాకు వింటుంటే  చేప్తునట్టు అనిపిస్తది కాంప్లీమేంట్

నాన్న పేరు చేప్పి రోజు ఏస్ క్రీం కానిస్తుంది
అమే చేప్పే సాకులు వింటుంటే మనసును అలరిస్తుంది

అడుగుతుంది వాళ్ళ అమ్మను నాన్న ఇంటికి వస్తే తాళం వేసి ఉంటది ఎలా 
వింటే అనిపిస్తుంది మనసుకు హాయి చాలా

వాళ్ళ మేనమామలు అడిగితే, అంటుంది అమ్మ కంటే నాన్న అంటే ఎక్కువ ఇష్టం
ఆమే నుండి ఇక దూరం ఉండటం ఇక కష్టం

తొందరగ ముగించాలి ఈ దూరం
ఆమేను కలవటాని తొందరగ దాటాలి ఈ సముద్రాల తీరం

జి.సునిల్

POEM WHEN SHE STARTED SCHOOL

 

Sunday, May 8, 2016

గుర్తుకోస్తున్నాయి గుర్తుకోస్తున్నాయి (Written for Veeresh Bava)

గుర్తుకోస్తున్నాయి గుర్తుకోస్తున్నాయి

ఎక్కడొ పుట్టి, ఎక్కడొ పెరిగి 16 సంవత్సరాల క్రితం కలిసాం అందరం
మనకు బొధన ఇచ్చి మనను కలిపింది GCPE మందిరం 
 
ఈ రొజు కలిసాం మరొకసారి గుర్తు తేచ్చుకోవటాని ఆ జ్ఞపకాలు 
నిజంగా మళ్ళి రావు గడిపిన ఆ ఆనంద క్షణాలు

మళ్ళీ కలవాటానికి 16సంవత్సరాలు పట్టినందుకు ఉంది బాధ కొంత
కాని ఆ జ్ఞాపకాలు చేస్తుంది నా మనసును పులకింత

అక్కడ ఎర్పడిన మన స్నేహం
అయ్యేల చేసింది గడిపిన ప్రతి క్షణం ఒక ఆనంద ప్రవాహం 

అక్కడే వేసుకున్నాం భవిషత్తు కొరకు పునాదులు
కలిసి కట్టుగా ఆనందంగా భరించాం ఎన్నొ వ్యదలు

చిరు నవ్వుతొ కష్టాలను ఎదుర్కునేలా చేసింది మన స్నేహ బలం
కష్టపడి కలిసి ఎక్కాలనుకున్నాం అందలం 

మనలొ ఉంది కాబట్టే ఆ పట్టుదల
మనం చేరుకోగలిగాం ఈ ఎదుగుదల

నిజంగా ఎంతో సహయ పడింది అక్కడ గురువుల బోధనలు
వారికి మనస్పూర్వకంగా తేలుపుదాం మరొక్కసారి దన్యవాదములు

భావి తరాలకు ఇప్పుడు ఉపయోగ పడుతుంది ఆ శిక్షణ
వారి బంగారు భవిషత్తుకు  అవుతుంది మంచి రక్షణ

అప్పుడు గడిపిన ప్రతి సమయం
16 సంవత్సరాల నుంచి ప్రతి క్షణం గుర్తు తేచ్చుకుంది ఈ హృదయం
ఆ రోజులు మళ్ళి రావు   
ఆనాటి జ్ఞాపకాలు మన మనసునుండి ఎన్నడు చేరిగిపోవు  

కలిసి ఉంటెనే జీవితానికి ఉంటుంది ఒక అందం
కొనసాగిద్దాం దేవుడు ఇచ్చిన స్నేహ బందం

ఇక్కడ ఉన్న ప్రతి నేస్తం
కొరుకుంటునా జీవితాంతం మీ స్నేహ హస్తం
 

జి.వీరేశ్