Wednesday, June 27, 2012

POEM ON MY FATHER RETIREMENT (WRITTEN ON BEHALF OF MY DAD COLLEGUES)


Hi All


In this month, my Father is getting retired.

Strange thing happened. My Father used to write poem on their colleague functions, now their friends want to tell in that manner.

So extending my support by writing the below poem to them.


ప్రియమైన సహచరుడికి ఘనమైన విడ్కొలుతొ పలుకుతున్నాం పదవి విరమణ శుభాకంక్షలు

ప్రసాద్ మా సహకార సంఘంకి దొరికిన గొప్ప బహుమానం
అందుకే ఘనంగా జరపాలి అనుకున్నాం ఈ వీడ్కొలు సన్మానం

ప్రసాద్ మా సహకార సంఘంకి దేవుడు ఇచ్చిన మహా ప్రసాదం
అటువంటి తనకి విడ్కొలు పలకాలంటే మా మనసు పలకటం లేదు ఆమోదం

ప్రసాద్ మా అందరికి చేదొడు వాదొడు ఉండే సభ్యుడు
అటువంటి ఉద్యొగి మాకు మళ్ళి దొరకడు

అటువంటి తనకి విడ్కొలు చెప్పాలంటే మాకు రావటం లేదు స్వరం
మా మనసులు అయ్యాయి బాధతొ భారం

పిల్లల ఉన్నత స్థితి కోసం ఎప్పుడూ చేసేవాడు భారి కసరత్తు
అందుకే వారికి ఇచ్చాడు బంగారు భవిషత్తు

ఎదైన కార్యక్రమం ఉంటే మంచి కవిత్వంతొ ముందుకు వచ్చే వాడు ఈ కవి
ఇక ముందు మాకు వినపించకుండ పొనుంది ఆ పెదవి

ఎపుడూ మరవలేదు తన విధి నిర్వహణ
ప్రతి ఒకరికి తను అంటే ఎంతొ ఆదరణ

ప్రతి ఒకరికి ఎపుడూ ఉంటుంది తన సహకారం
ప్రతి సమస్యకు తన దెగ్గర దొరుకుతుంది పరిష్కారం

ఒక సారి ప్రసాద్ చేసాడంటే ఆడిట్
ఎటువంటి తప్పు దొరకదు అనేదే తనకు ఉన్న క్రెడిట్

అందరితొ ఉంటాడు కలిసి మెలిసి
ఎలా వదుల్కొం అటువంటి తనని మాకు తెలిసి తెలిసి

జీవితంలొ చాల కష్ట పడి అవుతున్నాడు ఈ రోజు రిటైర్
ఇక ముందు చాల ఆనందంగా ఉంటు హెల్త్ విషయంలొ తిసుకొవాలి ఎంతొ కేర్

ఈ రిటైర్మెంట్ తొ మా ప్రసాద్
జీవితంలొ డ్యూటి నుంచి అవ్వనున్నాడు ఆజాద్

ప్రసాద్ కు రిటైర్మెంట్ తొ దొరికింది మంచి అదును
ఇక తన కలంకి పెట్టొచు మరింత పదును

నిజంగ ఆ రంగంలొ మా వాడు చేస్తే కృషి
మా వాడు తప్పక అవుతాడు ఎవరికి అందని మనిషి

బాధ కలుగుతున్న తప్పదు కనుక విడ్కొలు పలుకుతున్నాం
పదవి విరమణ సందర్బంగా మా హార్దిక శుభాకంక్షలు తెలుపుతున్నాం

జి.సునిల్

No comments: