విదేశాలలొ కూడ కొనసాగుతున్న మన సంప్రదాయం
MY SALUTE TO THE NATION FOR GIVING US SUCH RICH CULTURE AND TRADITION.
శాన్ ఆంటోనియా: హిందూ టెంపుల్ ఆఫ్ శాన్ ఆంటోనియా (హెచ్‌టీఎస్‌ఏ)
వారు నిర్వహించిన వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది.
మొత్తం 129 ప్రవాస జంటలు ఆసీనమైన కళ్యాణ శుభ సన్నిధిలో ఏకతా పూజా నాదం మంగళప్రదమై మారుమ్రోగింది. వేదిక ప్రాంగణం వేదమంత్రోచ్ఛారణతో ప్రతిధ్వనించింది. దాదాపు 300 మంది భక్తులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ప్రభాతవేళ సుప్రభాతసేవతో స్వామిని మేల్కొలపడంతోనే వివాహ వేడుక సన్నాహం ఆరంభమైంది. నిత్య ఆర్జిత సేవల అనంతరం వెంకటేశ్వరుడు గరుడవాహన రూఢుడై మహాలక్ష్మి హాలులోకి ఆగమించాడు. అప్పటికే అక్కడ వేచివున్న దేవేరులు (శ్రీదేవి, భూదేవి)తో కలిసి కళ్యాణ మండపంలోకి ప్రవేశించాడు. పూజారులు శ్రీహరి దంపతులను పూమాలలతో అలంకరించి ఎదురెదురుగా కూర్చొబెట్టి శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. ఇందులో భాగంగా కన్యావరణం, వివాహ దీక్షా కంకణ ధారణం, మధుపర్క పూజ, వస్త్రాభరణ సమర్పణం, గోదానం, కన్యాదానం జరిపించారు. శుభముహూర్తం ప్రవేశించగానే మాంగల్యధారణ జరిగింది. చివరగా మహా మంగళ హారతితో కళ్యాణఘట్టం ముగిసింది. ఇకపోతే, కార్యక్రమంలో భాగంగా దేవాలయ విస్తరణ, ఆలయ అంతర్గత కట్టడాల నిమిత్తం నిధుల సేకరణకు పిలుపునివ్వగా విరివిగా విరాళాలు అందజేశారు. హెచ్‌టీఎస్‌ఏ చైర్మన్ ఎలెక్ట్, ఫండ్ రైజింగ్ కమిటీ చైర్మన్ టి. వెంకటేశ్వర (రాజ్) గౌడ్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
Article can also be seen in below link
MY REPLY TO MY SISTER
అక్క చాల బాగుంది
మీ అందరి మనసులు భక్తితొ అయ్యింది ఒక ఆధ్యాత్మిక వేదిక
అందుకే మీరు మరువలేదు వెళ్ళినా అమెరికా
అంగరంగ వైభవంగా జరిగినది కళ్యాణ మహోత్సవం మీ భక్తిని చూసి తన్మయత్వం చేంది ఉంటాడు ఆ దైవం
ఆ మహోత్సవం చూసిన వారి జీవితం అయ్యింది దణ్యం అనిపిస్తుంది వారికి లభించి ఉంటుంది ఏడు కొండలు ఎక్కితే వచ్చే అంత పుణ్యం
తప్పక ఆ కలియుగ దేవుడు మీ అందరికి తప్పక అందిస్తాడు తన ఆశిస్సులు ఎప్పుడూ చల్లగా చూస్తాడు మీ మంచి మనసులు
ప్రేమతొ మీ తమ్ముడు
జి.సునిల్

No comments:
Post a Comment