Tuesday, December 15, 2009

ఆ నలుగురు (WRITTEN AFTER INSPIRED BY THE FILM)

ఆ నలుగురు
ఆలొచించండి గురు
ఉన్నారా మీకు ఆ నలుగురు?

అందించగలిగితే మీరు ఇతరులకు ప్రేమ
వారి ఆప్యాయత చేరుతుంది మీ చిరునామ

ప్రతి వారు చూపించగలిగితే మంచితనం
అది ప్రతి ఒకరికి అవుతుంది మూలదనం

మానవత్వం చూపించిన ప్రతి మానవుడు
భువి ఉన్నంత వరకు ప్రజల గుండేల్లొ అవుతాడు మహనీయుడు

వచ్చేటప్పుడు ఎమి తీసుకరాలేదు,పోయేటప్పుడు ఎమి తీసుకపోలెం అని చేసుకుంటే అర్దం
ప్రతి ఒకరి జీవితంకి లభిస్తుంది ఒక పరమార్దం

మనను ప్రేమించే ఆ నలుగురు ఉన్నారా అని అలోచించండి?
వాస్తవాలు గ్రహించి, మీ తొచినంత వరకు ప్రేమను పంచండి

జీవితం నరకప్రాయంగా చాలామంది మదిలొ ఉంది భారం
వాళ్ళ కష్టాలు తగ్గించే చేదొడుగా తెరుద్దాం మన ప్రేమ ద్వారం

ప్రేమ పంచడమే అవ్వాలి అందరి ద్యేయం
అలా జరిగిననాడు అందరి జీవితాలు అవుతుంది బహుకమనీయం

ఇతరులకు నిస్వార్ద ప్రేమను పంచి గడుపుదాం ఈ జీవితం
అప్పుడు ప్రతి ఒకరి పేరు చరిత్ర పుటలొ అవుతుంది శాశ్వతం

జి.సునిల్

No comments: