ముగిసింది ఇండియన్ ఐడల్ కాంటెస్ట్
విజేతగా నిలిచాడు ద బెస్ట్
అన్ని రంగాలలొ తెలుగు వారు ముందున్నారు అన్నది నిజం
ఇండియన్ ఐడల్ లొ విజయకైతనం ఎగురవేసింది మన తెలుగు తేజం
మన శ్రీరాంచంద్ర గేలిచాడు ఇండియన్ ఐడల్
అయ్యాడు అందరికి ఐడియల్
అతని ప్రతి ప్రదర్శన ప్రతి భారతీయుడిని మురిపించింది
న్యాయనీర్నేతలను మెప్పించింది
శ్రీరాం విజయాన్ని జరుపుకున్నాం ఘనంగా
శ్రీరాం మా వాడు అని చొప్పుకుంటున్నాం అందరికి గర్వంగా
ఇది తెలుగు వారి విజయం ముమ్మాటికి
అతని విజయం యొక్క ఆనందం మనలొ ఉంటుంది ఏప్పటికి
పెంచాడు మరింత తెలుగు వారి కీర్తి
అందించాడు అందరికి స్పూర్తి
అతనిని గెలిపించింది అతను పడ్డ శ్రమ
దానికి తొడయింది మన తెలుగు వారి ప్రేమ
శ్రీరాం శ్రమ, వినయం అతని బలం
అది కొనసాగించినంత కాలం, ఎక్కుతునే ఉంటాడు మరింత అందలం
శ్రీరాం విజయం అతని తల్లిదండ్రులకు ఇచ్చింది పుత్రొత్సాహం
కనిపించింది వారి మోకంలొ అనంద ప్రవాహం
శ్రీరాం ఇండియన్ ఐడల్ లొ నెo.1 గా నిలిచావు
నీ విజయంతొ తెలుగు వారి సత్త చాటావు
తెలుగు సినిమాలొ నెo.1 మన ఇంద్ర
ఇండియన్ ఐడల్ లొ నెo.1 మన శ్రీరాంచంద్ర
శ్రీరాం నీ విజయం మార్చింది నీ దశ
పట్టుదల ఉంటే ఏదైనా సాదించొచ్చు అని అందరిలొ కలిగించింది ఆశ
ఇంతటితొ ఆపేయకు నీ వేట
సాగించు నీ పయనం కొళ్ళ కొట్టేంత వరకు ప్రపంచ సంగీతపు కోట
శుభాకాంక్షలతొ
జి.సునిల్