వై.యస్.ఆర్. అమర్ రహే
ఆ రోజు జరిగింది మన ముఖ్యమంత్రి మరణం
వారు కనిపించని 24గంటలు ప్రజలు అన్నారు "నువ్వు జనం కొసం బ్రతికే రాజువయ్య"
నీలాంటి వారు మా కొసం బ్రతకాలయ్య
కాని క్రాష్ అయింది వారు పయనిస్తున్నా హెలికాప్టర్
దానితొ ముగుసింది ఒక మహొన్నతమైన నాయకుడి లైఫ్ చాప్టర్
ఆ సంఘటన వారిని, తెలుగు వారి నుంచి వారిని చేసింది దూరం
తెలుగు ప్రజలపై మోపింది మోయలేని భారం
ఆ వార్తతొ ఆంధ్ర ప్రజల గుండె పగిలింది
వారిలొ వర్ణించలేని శొకాన్ని మిగిల్చింది
వారి మరణం వారి పార్టికి, దేశానికి తీరని లొటు
మరి ఏ నాయకుడు భర్తిచేయలేరు వారి చోటు
వారికి కలిగింది ప్రజల ప్రేమను పొందే భాగ్యం
వారి మరణంతొ ప్రజల్లొ కలుగుతున్నది "జీవితం అంటే ఇంతేనా?" అని వైరాగ్యం
జనం తట్టుకొలేకున్నారు జరిగిన ప్రమాదం
వస్తున్నది తమ నాయకుడిని దూరం చేసిన దైవంపై క్రొదం
వారు ఎటువంటి పరిస్థితినైన ఎదుర్కునే యోదుడు
జనం కలలుకన్న జలయఙ్ణం సాదించాలనుకున్న భగీరదుడు
పార్టికి అధికారం తేప్పించాలని పట్టారు పంతం
ప్రజలకు చేరువ అయ్యి అధికారం చేసారు వారి పార్టికి సొంతం
తన వారిని ఎల్లప్పుడు ఆదుకునటమే వారి తత్వం
జన బలంతొ పార్టిలొ వారిది అయింది తిరుగులేని నాయకత్వం
వారి నాయకత్వ లక్షణాలతొ ప్రజలకు అయ్యారు వారు ఆశాతరంగం
వారి మరణం కలిగించింది ప్రజల ఆశలపై భంగం
ప్రజల్లొ వారి పార్టికి వేసారు గట్టి పునాది
వారి మరణం వారి ఆశయాలపై వేసింది సమాది
వారు మరణంలేని నాయకుడు
జనం మధ్య ఎప్పుడు నిలిచే అమరుడు
జనంలొ కొనసాగుతుంది జరిగిన ఘటనపై దిగ్బ్రాంతి
వారి ఆత్మకి కలగాలని కోరుకుందాం మనశ్శాంతి
వారు ఎప్పుడు జనం గుండేల్లొ జీవిస్తారు
వారి ఆశయాలు జనం కళ్ళతొ చూస్తారు
ఇట్లు
జి.సునిల్
No comments:
Post a Comment