Friday, August 28, 2009


మా  ప్రణీత్  కౌంటి
ఎన్నో ఆటుపోట్లు తర్వాత ఎర్పడింది మా  ప్రణీత్  కౌంటి
అందరి సహకారంతో ఒక ప్రేమాలయంగా రూపుదిద్దుకుంది మా సోసైటి

మాకు దొరికిన గొప్ప వరం
కౌంటి శ్రేయస్సు కోరకు ఉంటుంది  ప్రతి ఒకరి స్వరం

కౌంటి మేలు చేసే ప్రతి పని అంటే మరు క్షణం అక్కడ నిలుస్తారు
శక్తి వంచన లేకుండా సమిష్టి కృషితో ఆ పని పూర్తి చేస్తారు

మా కౌంటి సంక్షేమం మమ్మల్ని ఎప్పుడూ నిలుపుతుంది ఏకం
అలాగే మాకు దొరికింది మంచి బాట చూపే పెద్దరికం

అప్పుడప్పుడు మాలో కలిగినా ఆవేశం
కౌంటి మేలు కోరకు మరు క్షణం అన్ని అవుతాయి శేషం

ఈ మద్య జరిగిన మా కౌంటిలోని వేడుకలు
మరింత దృడం చేసాయి మా బందాలు

మాకు దొరికింది మా అందరి గర్వ కారణం అయిన ప్రణీత్ కౌంటి వేదిక
అందరి భాగస్వామ్యంతో ఘణంగా జరుగుతుంది ఇక్కడ ప్రతి వేడుక

మాలో నిలిచే ఆత్మీయత
చేస్తుంది మా కౌంటి ఎప్పుడూ విజేత

అందర్నీ చల్లగా చుడాలని చేస్తున్నాము వినాయకుడిని మా కౌంటిలో స్వాగతం
13 రోజులు ప్రతి ఒకరు అవ్వనున్నారు స్వామి సేవకి అంకితం

ఆ స్వామి ఆశీస్సులతో ఎప్పుడూ అష్టైశ్వర్యాలతో ఉండాలి మన లోగిలి
మనలొ ఈ ఏకతాభావం ఎల్లపుడూ మనలో నిలవాలి

జి.సునిల్

No comments: