మా జీవిత ప్రయాణంలో ప్రియమైన
ప్రవర్తిక
మా జీవితంలోకి వచ్చాక ప్రవర్తిక
మొదలైంది మా జీవితంలో అసలైన కదలిక
మా కలలకు పోసింది ఊపిరి
అయింది మా జీవిత సిరి
తనకు తెలుసు ఎప్పుడూ మేము ఉంటాం తన వెనుక
ఆ ధైర్యంతో ముందుకు సాగుతూ మాకు ఇస్తుంది సంతోష పరిచే కానుక
అనుకున్నాము మేము ఉంటే చాలు ప్రతి విషయంలో
తనకి తోడు
తను అయింది మమ్మల్నే ఉత్తేజ పరిచేలా నేడు
తన లక్ష్యాలకు తనే వేసుకుంటుంది ప్రణాళిక
మేము కేవలం అవుతున్నాం తను వేసుకున్న
దారికి కావాల్సిన ఏర్పాటు చేసే వేదిక
అన్ని విషయాల్లో తోడు ఉంటూ న్యాయం చేస్తుంది
పెద్ద కూతురు పాత్ర
కొన్ని విషయాలలో అయింది మాకు దిశ చూపే నేత్ర
తనకు తానే పెంచుకుంది చిత్రాలను వేసే కళా
మాకు ఎంతో సంతోషంగా ఉంది, అందరు తనని అంటుంటే భళా
తన పలుకు మార్చింది మా జీవిత ప్రయాణం
ఎంతో ఆహ్లాదం
ఛేదించేలా చేసింది జీవితంలోని ప్రతీ
అవరోధం
ప్రవర్తిక, నిజంగా నువ్వు మా కుటుంబ సభ్యురాలు అవ్వటం మా అదృష్టం
ఈ కవితతో మేము తెలియజేస్తున్నాము ప్రవర్తిక నీపై మా ఇష్టం
పుట్టినరోజు శుభాకాంక్షలతో
నీ కుటుంబసభ్యులు




