Saturday, September 10, 2022

ప్రణీత్ కౌంటీ గణేష్ ఉత్సవాలు


ప్రణీత్ కౌంటీ గణేష్ ఉత్సవాలు

 

తక్కువ వ్యవధిలో ఉత్సవ ఏర్పాట్లు చేయటాన్ని కమిటీ తీసుకుంది సవాల్ గా

సమిష్టి కృషితో ఎన్నో వ్యయప్రయాసలతో చేసింది ఉత్సవాలను ఎంతో ఘనంగా

 

ఎంత కష్టమైన వెనుక గణేశుని ఆశీస్సులు ఉంటుందనే కమిటీ ధీమా

తమ కౌంటీ వాసులను ఆశీర్వదించమని తీసుకుని వచ్చారు మట్టి ప్రతిమ

 

ప్రతి రోజు జరిగాయి గణేశుని పూజలు

అందుకున్నారు ప్రతి ఒక్కరు స్వామి వారి దీవెనలు 

 

మొదటి రోజు నుంచి   ప్రారంభమైన చిన్నారుల చిందులు

చివరి రోజు వరకు వారి ఉత్సాహానికి లేకుండా పోయింది అవధులు 

 

వారి చిరు నవ్వులు ప్రతి ఒక్కరికి అయింది ఇష్టం

చూసి ప్రతి ఒకరు మరచి పోయారు పడిన కష్టం

 

మహిళల భాగస్వామ్యంతో అలరించాయి  చిన్నారుల నౄత్యాలు

ప్రతి ఒక్కరి  మనసు దోచుకున్నారు మెరిసిన ఈ తారలు

 

మరిన్ని  కార్యక్రమాలతో  అంగరంగ వైభవంగా జరిగాయి ఉత్సవాలు

భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరూ పొందారు ప్రోత్సాహకాలు 

 

ప్రతి ఒక్కరు  నమ్మారు స్వామి తోడు జీవితానికి కొండంత బలం

అందుకే రికార్డ్ బద్దలు కొట్టింది  జరిగిన వేలం


ప్రణీత్  కౌంటి చూపింది ఉత్సవాల విషయంలో ఎక్కడా తగ్గేదేలే

స్వామి వారి శోభాయాత్ర ముగిసే అంత వరకు అంతట వినిపించింది స్వామి   జైజైలే

 

భాగస్వామ్యం అయిన  ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు 

స్వామి పూర్తి చేయాలి మీ ప్రతి ఆశయాలు

 

అశిస్తు మీ

ప్రణీత్ కౌంటీ ఉత్సవ కమిటీ