మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
జోహార్లు మహిళలు
జోహార్లు మహిళలు
ఎవరి వల్ల కాదు మీరు చేసే భాద్యతలు
మీరే ఈ సృష్టికి మూలం
మీరే కుటుంబ విజయానికి బలం
మీరు చూపే సహనం
ప్రతి ఒక్కరి ఇంటికి బహుమానం
సూర్యుడు రాకముందే మొదలవుతుంది మీ ఉదయం
కష్టిస్తూ చిరునవ్వుతో గడుపుతారు ప్రతి సమయం
ఇంటి పనులలో మీకు ఏనాడు కలగదు అలసట
వేస్తారు కుటుంబానికి బంగారు బాసట
మీతోనే ప్రతి కుటుంబానికి జీవం
మీతోనే ప్రతి కుటుంబానికి వైభవం
సమాజ నిర్మాణంలో అవుతున్నారు మగవారితో సమానం
కాని మీమ్మల్ని గుర్తించలేని ప్రస్తుత సమాజ వైనం
మారాలి ఈ పరిస్థితి
మీ భాగసామ్యంతోనే ప్రగతి పథంలోకి వస్తది ఈ జగతి
మీ పోరాట పటిమతోనే చూప కలుగుతున్నారు తెగువ
అందుకే మీకు అందరు పలుకుంతున్నారు విజయీభవ
వెనుకడుగు వేయకుండా కోనసాగించండి మీ శక్తి
త్వరలోనే సమజంలో జరుగుతున్న అన్యాయం నుండి పొందాలి విముక్తి
ఆశిస్తూ,శుభాకంక్షలతో
సునిల్