Saturday, July 21, 2018

రెండు సంవత్సరాల ఆరాధ్య




రెండు సంవత్సరాల ఆరాధ్య

ఆ..ఆనంద
రా.రాగాల
ధ్య..ధ్యానం

అప్పుడే ఈ నాన్న కుట్టి
రెండు సంవత్సరాలు పూర్తీ అయ్యింది మా జీవితంలో రాబట్టి

సమయం తెలియకుండా గడిపేలా చేసింది తన అల్లరి
మా జీవితంలో ఆనందమయ బంధం ఈ చిన్నారి

మాకు దొరికిన ఒక అద్భుతమైన ముసిముసి నవ్వుల అందమైన ఆత్మీయం
ఆమేతో ప్రతి క్షణం ఎంతో రమణీయం

ప్రవర్తికకు దోరికిన ఒక చేదోడు నేస్తం
వారు ఇరువురు కలిస్తే మరచిపోతారు లోకాన్ని సమస్తం

ఆమేలో కూడా ఉంది గోకర ఆడపడుచు పౌరుషం
ఏమైన అంటే సహించదు ఒక నిమిషం

ఇక చూడాలి మా ఇద్దరి బుజ్జగింపు
కూల్ అయ్యాక మళ్ళీ చేస్తుంది తన చిరు నవ్వుల ప్రేమను కొనసాగింపు

ఆమే స్వరం మనకి అందని ఊహలు
ఆశ్చర్యం కలగ తప్పదు పాట తగ్గ ఆమే తీసే రాగాలు

తప్పక ఈ గాన కోకిల
ఆశిస్తున్నాం అవుతుందని మా అందరి గర్వపడే మేరిసే జ్వాల

ఆమే మాటలు మా అందరికి ముద్దు
ఆమేతో సరదాగా గడపనిదే మాకు పోదు పొద్దు

మా జీవితంలో వచ్చినపటినుంచి ఈ అమ్మడు
సరదా వీడియోలతో చేస్తున్నాం కుమ్ముడు

మా ఇరువురి కుమార్తలు చూపే మమతలు
మరిచేలా చేస్తాయి జీవితం ఎటువంటైన కలతలు

కూతుర్లతో గడిపినా ప్రతి క్షణం ఎంతో రమ్యం
ఈ జీవితానికి చాలు చేర్చగలిగితే వారి ఇరువురిని వారి జీవిత గమ్యం

జి.సునిల్