Saturday, August 12, 2017

గుండెల్లో అలజడి


గుండెల్లో అలజడి

లేదు ఇంట్లొ నా కుతుర్ల హడవుడి
గుండెల్లొ మొదలు అయ్యింది అలజడి

మనసు అంటుంది చల్
పరుగులు తీయి వరంగల్

కాని వెళ్ళకుండ చేసింది వృత్తి పరిమితి 
ఇధే విధి ఆడే వింత పరిస్థితి

కనబడుట లేదు డ్యాన్స్ చేసే ప్రవర్తిక 
మళ్ళీ వచ్చే అంత వరకు ఇంట్లో సందడి లేదు ఇక  

నాన్న నాన్న అంటుందంట చిన్న సుందరి
మిస్ అవుతున్నా మా రోజు వారి సంగితపు కచేరి

ఇంక రోండు రోజులు 
చూడాలంటే నా ప్రేమ కలిగిన అల్లరి అమ్మాయిలు 

ఘనంగా చేసుకోబోతున్నాం  మన పంద్ర ఆగష్ట్ మహోత్సవము
ఆ రోజు  కలగనుంది ఈ బాధ నుంచి నాకు కూడ స్వాతంత్ర్యము   

జి.సునిల్