Saturday, July 22, 2017

ఆత్మియ బంధము "మా ఆరాధ్య"



ఆత్మియ బంధము "మా ఆరాధ్య"

మా జీవితంలోకి ప్రవేశించింది ఆరాధ్య
తన అక్క లాగా మాకు ఆనందంతొ చేసింది మరింత సయోధ్య

అప్పుడే ఒక సంవత్సరం పూర్తి అయ్యిందా అని కలుగుతుంది మాకు ఆశ్చర్యము 
అలా మమ్మల్ని మైమరిపించేలా చేసింది తన ప్రేమతోకూడిన స్వరము  
 
పొందింది తన అక్కతో పాటు సమానమైన స్థానము
ఎంతో ప్రేమతో ఉంటుంది తను చూపే ఆత్మియము

ఆరాధ్య ఆఫిస్ నుంచి వచ్చే నాకు ఇస్తుంది హార్దిక స్వాగతము
తన చిరు నవ్వు చూసిన వెంటనే నా భాదలు అవుతాయి అంతము

తను మాకు దొరికిన గాన కోకిల
రోజు మా ఇంట్లొ వినిపిస్తుంది సంగితపు గల గల

తన అక్కతో పోల్చుకుంటే చాలా విషయాల్లో తను చూపుతుంది మోనము
అలా అని అనుకునేలోపలే కొన్ని విషయాల్లో నేగ్గించుకుంటుంది తన పంతము

ఇంట్లో ఎక్కడ చూసిన కనిపిస్తుంది తన ఆందించే ఆనందపూ ప్రవాహము
మమ్మల్ని ఎంతో ఉత్తేజ పరుస్తుంది తను చూపే ఉత్సాహము

తన అక్కకి తన చెల్లి అంటే చాల ఇష్టము
ఒకరికోకరు మంచి స్నేహితులు అవుతారు అనేది చాల స్పష్టము


ఇంట్లో పాట మోదలు అయ్యింది అంటే స్టార్ట్ అవుతాయి మా ముగ్గిరి స్టెప్పులు
మా ముగ్గిరి గోలతో తప్పవు మంజులకి తిప్పలు 


మాకు దొరికిన ఇరువురు కూమార్తేలు
మాకు రెండు కనులు


ఎంతో ఆనందంతో చేసాము మా జీవితంలో ఇరువురిని ఆహ్వానము
ఆశిస్తున్నాము వారు జీవితంలో ప్రతి విషయంలో పొందితారు విజయ మార్గము


మా అదృష్టం మాకు దొరికిన ఈ ఇరువురి బంధము
మాకు ఒకటే కోరిక వారి జీవితంలో ఎప్పుడూ అవ్వాలి ఆనందం శాశ్వతము


ఈ రోజు తనను ఆశిర్వదించిన ప్రతి ఒకరికి దన్యవాదము
మీ ప్రతి ఒకరి దీవేనలు అవ్వాలి తన జీవితంకి కోడంత బలము


జి.సునిల్