Thursday, December 5, 2013

నిజంగా మేటి రత్నం....మా అత్త కోటి రత్నం (Poem on my Aunt Retirement)

నిజంగా మేటి రత్నం....మా అత్త కోటి రత్నం

పదవి విరమణ తర్వాత మా అత్త విశ్రాంతి తీసుకుంటుంది అనుకుంటే మీ భ్రమ
ప్రస్తుతానికి అమే పని చేసే తత్వానికి పెడుతున్నది కామ

ఎందుకంటే అమే కోటిరత్నం
ఎప్పుడూ ఆమే కుటుంబానికి ఎదో చేయాలని ఉంటుంది ఆమే ప్రయత్నం

మొదటి నుంచి ఆ విధి ఆమెకు చేయాలనుకుంది బూరా హాల్
ఆ విధి రాతను సైతం ఎదురించి, గెలిచి చేసింది తిరిగి సవాల్

ఎంతో కష్టాలతొ నడిచింది అమే జీవన మైదానం
అమే స్వయంకృషితొ ప్రతిది అయింది ఆమేకు ఒక బహుమానం

ఎంత కష్టాన్ని అయిన భరించి అమే పడింది ఎంతో శ్రమ
ఆ కష్టాన్ని తన కుటుంబానికి తెలియకుండ, వాళ్ళకు అందించింది ప్రేమ 

ఎందుకంటే తను అనుభవించిన ఆవేదన
తన కుటుంబం పడకూడదు అనేదే ఆమే ఆలొచన

అలా ప్రతి క్షణం అమే కుటుబానికి వెతికింది బంగారు భవిషత్తుకు దారులు
ఈ ప్రయాణంలొ, ఆమేను అర్దం చేసుకోని అమేకు అండగా నిలిచారు ఆమే కుమారులు

వాళ్ళ కొరకే ప్రతి సంక్లిష్టాన్ని అమే చేసుకుంది ఎంతొ ఇష్టం
నిజంగా ఇలాంటి మాతృమూర్తి వాళ్ళకు దొరకటం వాళ్ళ అదృష్టం

ఎంతొ ఇష్టంతొ కట్టుకున్న రామకోటి నిలయం
ఆమేకు ఒక దేవాలయం

తను కోడలు మెచ్చిన అత్తమ్మ
వారికి అమే ఇంట్లొ అయింది మరో అమ్మ


మాకు లభించిన ఈ స్త్రి మూర్తి
మా అందరికి ఎంతొ స్పూర్తి

ఎంతో గర్వంగా తెలుపుకుంటాం కోటిరత్నం మా మేనత్త
నిజంగా ఎవరికి లేదు ఆమేకు ఉన్న సత్త

తన శేశ జీవితంలొ కూడ తన కుటుంబం కోసం శ్రమిస్తుంది
అమే అకుంటిత పట్టుదల ప్రతి ఒకరికి స్పూర్తినిస్తుంది

శుభాకాంక్షలతో చేయమంటున్నాం కొత్త జీవితాన్ని ప్రారంబం
ప్రేమానురాగాలతో ఎప్పుడూ ఉండాలి ఆమేతొ మా అనుబందం


ఇట్లు
జి.సునిల్, 

కోటిరత్నం గారి శ్రేయోభిలాషులు