Tuesday, February 21, 2012

ప్రపంచ మాతృ బాష దినోత్సవ శుభాకాంక్షలు (21st Feb)

దేశ భాషలందు తెలుగు లెస్స

ఎంతో గొప్పది మన తెలుగు బాష
అది ఆదరణ లేకుండ పొయి పడుతున్నది ఘోష
అలా కాకుండ అందరి ఆదరణ పొందాలనేది నా ఆభిలాష

మన తెలుగు బాషకి "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్" అని బిరుదు

అలాంటి బిరుదు రావటం ఎంతొ అరుదు
అలాంటి తెలుగు బాష మీద నిర్లక్ష్యం వలదు

ఎంతో గొప్పది మన తెలుగు బాష సాహితి
మారలి ప్రస్తుతం తెలుగు బాష కున్న దుస్థితి
మెరుగు పడాలి మన తెలుగు బాష యొక్క పరిస్థితి

పెంచుకుందాం మన తెలుగు బాష మీద మమకారం

పదిలంగ ఉంచుదాం మన తెలుగు బాషని, తద్వార ఆస్వాదించకలుగుతారు భావితరం
ఇందుకు కావాలి ప్రతి ఒక్కరి సహకారం

ఏ బాషకి కాదు తెలుగు బాష తక్కువ

పెంచుకుందాం మన తెలుగు బాష మీద మక్కువ

ప్రభుత్వం కూడ తెలుగు బాష పరిరక్షణకు చేయాలి ఒక కార్యచరణ

అప్పుడే అందరిలొ పెరుగుతుంది తెలుగు బాష పై ఆదరణ

మన తెలుగు బాష ఎంతో గొప్పది
అలాంటి బాషను కాపాడు కొవలసిన బాధ్యత మన అందరిది

జై తెలుగు తల్లి

జి.సునిల్