అద్భుతమైన శ్రీరామరాజ్యం
శ్రీరాముడు నా ఇష్టమైన దైవం
అలాంటి నా దైవం గురించి తీసిన శ్రీరామరాజ్యం నాకు మిగిల్చింది మధురాతి అనుభవం
శ్రీరామరాజ్యం ఒక అద్భుతమైన కళాఖండం
అందులొ విశేషాలు అఖండం
అందంలో, ఆదర్శంలో అందరికి ఆదర్శప్రాయం మన రామయ్య
అలాంటి చక్కని పాత్రకి అద్భుతంగా నటించారు మన బాలయ్య
అందరి అంచనాలు మించి సీత పాత్రకి చక్కటి న్యాయం కలిగించింది నయనతార
ఆమె నటన చూసిన ప్రతి వారికి తప్పక వస్తుంది కన్నిటి దార
రామాయణాన్ని రచించారు వాల్మీకి
ప్రత్యేక అభినందనలు ఆ పాత్రలొ మహా అద్భుత నటనను ప్రదర్శించిన అక్కినేని నాగేశ్వరరావు గారికి
ఒక మహా అద్భుత దృశ్యకావ్యంగా ఈ సినిమాను మలిచారు బాపు
సినిమ మొత్తం అయ్యే అంత వరకు , తెర మీద నుంచి కదలలేదు మా చూపు
మా తనువుకు తన్మయత్వం కలిగించింది ఇళయరాజ గారు ఇచ్చిన ప్రతి పాటలు
ఆ పాటలను వర్ణించాలంటే చాలవు చెప్పిన ఎన్ని మాటలు
ప్రోడ్యుసర్ సాయి గారి ఒక మంచి ప్రయత్నానికి దొరుకుతున్నది మంచి స్పందన
వారి మంచి సంకల్పానికి మరియు కలిగిన విజయానికి అందిస్తున్నాం మా అభినందన
చూసిన ప్రతి వారికి ఈ సినిమా అయ్యింది ప్రీతి
తప్పక ఈ సినిమా పెంచుతుంది తెలుగు సినిమా ఖ్యాతి
తప్పక ఈ సినిమా ప్రతి ఒకరిని అలరిస్తుంది
ఒక మహా అద్భుతాన్నిచూసిన తరువాత మీ మనసు తప్పక ఆనందంతో పులకరిస్తుంది
మన పురాణాలను మరచి పోతున్నది ప్రస్తుత తరం
అవి కాపాడడానికి ఇటువంటి సినిమాలు మనకు చాలా అవసరం
మానవ సంబందాలు మరచిపోయేల చేస్తుంది ప్రస్తుత సమాజంలో ఉన్న వేగం
ఇటువంటి సినిమాలు తెలుపుతాయి ఒకప్పుడు ఆ సంబందాల కొరకు జరిగిన త్యాగం
ఈ సినిమ చూడడానికి చేసుకోండి కొంచం తీరిక
తెలుసుకోండి ఎటువంటి మహనీయుడొ మన జగదానంద కారక
ఉంటే శ్రీరామరక్ష
ఉండదు మీ జీవితానికి ఎటువంటి శిక్ష
జి.సునిల్
శ్రీరామ భక్తుడు