ఆడపిల్ల అయితే ఏంట్రా
పిల్లలు పుట్టేటపుడు తేడా చూపించకు అంటూ మగ ఆడ
సమాన ప్రోత్సాహంతో ఎవరైనా ఎంతో ఎత్తుకు తీసుకెళ్తారు నీ ఇంటి జాడ
నింపు వారిలో ఉత్సాహం
విజయాలతో పెంచుతారు నీ ఇంటి నామం
కించపరచకు వాళ్ళని నీ చోటు నాలుగు గోడలని
నీ సహాయంతో వారు అవుతారు నీకు అసలైన గని
వాళ్ళు పుట్టలేదు చేయటానికి బండ చాకిరీ
వారికి ఉంది శక్తి దేశానికే చూపే దారి
ఆడపిల్ల అని చూపకు లోపం
నీకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళే నీకు ప్రేమ అందించే ప్రతిరూపం
సమాజం కించపరిచే మాటలను పక్కకు పెట్టు
నీ అండతో వారిని ఎక్కించు మరో మెట్టు
పెళ్ళి చేయటమే కాకుడదు నీ లక్ష్యం
సరైన దారి చూపించి, చేర్చు వారు సాదించగల గమ్యం
అందించు నీ చేయి
సాధిస్తారు వారి ప్రతి కల మైలురాయి
అందుకే ఆడ మగా అనే తెరను ఇకనైనా దించరా
గ్రహించు వారి విజయంతో జయం మనదేరా
జి.సునిల్
(Written inspired by Dangal Movie)
Good bro
ReplyDeleteAmazing bhayya...
ReplyDeleteVery nice 👌 amazing message.... Congrats 💐 Sunil Garu 💐
ReplyDeleteSuperb👍😀
ReplyDelete