Sunday, July 10, 2011

స్నేహితుడు


స్నేహితుడు

ఒక మంచి స్నేహితుడు
అన్ని విషయాలు పంచుకోగల సన్నిహితుడు


ఒక మంచి స్నేహం
ఎంత తాగినా తీరని దాహం


అన్ని విషయాలలొ మన వెంట ఉండేది నేస్తం
చివరి వరకు అందరు కోరుకుంటారు అటువంటి హస్తం


మన పరిస్థితులు బాగ లేక పొతే, దగ్గర వారు కూడ చేయొచ్చు మన నుంచి రన్ను
కాని అటువంటి సమయంలోను స్నేహితుడు ఉంటాడు మన వెన్నుదన్ను


అవసరం అయితే మన కోసం ఇస్తాడు తన ప్రాణం
అది ఒక మంచి నేస్తం యొక్క గుణం

ఎటువంటి రక్త సంబందం లేకున్నా, దొరికిన ఆప్తుడు
అలాంటి వాడు దొరకటం చాల కష్టం, నేడు


ఒక విషయం నేను చేయాలనుకుంటున్న స్పష్టం
ఒక మంచి స్నెహితుడు దొరకటం ఒక అదృష్టం

జి.సునిల్

1 comment: